Home South Zone Andhra Pradesh సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పీవీ సింధు |

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పీవీ సింధు |

0
0

*EAGLE TEAM VIJAYAWADA*

ఈరోజు 22/12/2025 తేదీన
87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 విజయవాడ లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగింది. గౌరవ IGP EAGLE శ్రీ ఆకే రవికృష్ణ గారి ఆదేశాలమేరకు విజయవాడ ఈగల్ టీమ్ ఈ కార్యక్రమం పాల్గొని ఈగల్ డిపార్ట్మెంట్ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారిని PV సింధు గారు మాట్లాడుతూ

డ్రగ్స్ అనేవి తాత్కాలిక ఉట్టేజాన్ని ఇచ్చి శాశ్వతంగా నాశనం చేస్తాయి. కావున తాత్కాలిక ఆనందంకోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ కు సంబందించిన ఏవిధమైన సమాచారం ఉన్నా EAGLE toll free నెంబర్ 1972 కి కాల్ చేసి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేసారు.
అలాగే
” Say no to drugs, say yes to Games ”
“Say no to drugs, say yes to Life ”
అనే స్లొగన్స్ చెప్పారు.

విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని చిన్ని గారు మాట్లాడుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ఉద్దేశ్యంతో ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి, చాలా అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం, రైడ్ ద్వారా చాలామంది ప్రజలకు, డ్రగ్స్ వలన కలిగే నష్టాలను తద్వారా వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలును తెలుపడమైననది. డ్రగ్స్ కి సంబంధించిన ఏ సమాచారం ఉన్న ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేయమని మరియు కాల్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పడం జరిగింది. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రతి తల్లి ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయాలని, ప్రతి పౌరుడు ఇందుకు సహకరించాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీ పీవీ సింధు గారు,విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని చిన్ని గారు, ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు, ఏసిపి శ్రీ దామోదర్, ఈగల్ ఇన్స్పెక్టర్స్ శ్రీ ఎం రవీంద్ర, డి.నాగార్జున, ఈగల్ ఎస్సై శ్రీ ఎం.వీరాంజనేయులు పాల్గొన్నారు.
నమస్తే సార్ 🙏.

NO COMMENTS