కర్నూలు :
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి (ఐపీఆర్‌సీ).. అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్): 41గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్): 15టెక్నీషియన్ అప్రెంటిస్: 44అర్హత:
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌కు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్)కు బీఏ, బీఎస్సీ, బీకాం అవసరం. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు డిప్లొమా కావాలి. 2021-2025 మధ్య డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.వయసు: గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు 28 ఏళ్లు; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు
; ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) అప్రెంటిస్‌కు రూ.9,000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.ఎంపిక: ఇంటర్వ్యూతో.ఇంటర్వ్యూ తేదీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు 10.01.2026, గ్రాడ్యుయేట్ నాన్ ఇంజినీరింగ్‌కు 11.01.2026.వెబ్‌సైట్: https://www.iprc.gov.in/index.html






