కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి చేస్తుంటే జగన్ ఓర్వలేక గగ్గోర్లు పెడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మంగళవారం విమర్శించారు.
తన హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు సంతకాల సేకరణ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు బర్త్డే వేడుకల్లో పోటీలను కోసుకొని ఎంజాయ్ చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు.
