• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం
• క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం
• వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది
• సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది
• ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది.
• ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
• ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు
• క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి
• క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం
• నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది
• క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు
• నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం.
• క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్‌నే సిద్దం చేసుకున్నాం
• లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం
• వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగానే వన్ ఐటీ, ఏఐ యూజ్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నాం
• క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు
• విజన్‌ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది
• ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్
• అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం. ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నాం






