దేవరాఫసల్వాడ్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం
దౌలతాబాద్ మండలం, వికారాబాద్ జిల్లా దేవరాఫసల్వాడ్ గ్రామంలో నూతన సర్పంచ్ శ్రీ కూరా రాజు (డాక్టర్ రాజు), ఉప సర్పంచ్ చుట్టకూల చెన్నప ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డ్ మెంబర్లను గ్రామ ప్రజలను అందరిని కలుపుకొని పక్షపాతం లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ .
ఇంచార్జి తిరుపతి రెడ్డి దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రావు సహకారంతో మన గ్రామన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తా అని ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా అభివృద్ధికి ఆటంకం చేయకుండా అభివృద్ధికి సహకారం చేయాలనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ కోడంగల్ barataawaz సూర్యామోహన్




