Home South Zone Andhra Pradesh పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !! |

పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !! |

0

కర్నూలు :

పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ :
ఇప్పపటివరకు మీరు సాధారణ పౌరులు (సివిలియన్స్).. ఇకపై పోలీస్ కుటుంబంలోకి అడుగు..

స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 633 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు 9 నెలల పాటు ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందనున్నారు.

ప్రారంభ కార్యక్రమానికి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ శిక్షణ కళాశాల నిర్వహణకర్త దీపికా పాటిల్, అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, తదితరులు డీఐజీకి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు.పటాలం శిక్షణ కేంద్రంలో 437 మంది, అలాగే కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో 209 మంది కలిపి మొత్తం 646 మందికి కమాండెంట్ దీపికా పాటిల్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీఐజీ పలు విషయాలపై నూతన కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని, క్రమశిక్షణతో తరగతులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

NO COMMENTS

Exit mobile version