డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అధికారులు నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
మండలకేంద్రం లో సిద్దబోయిన బాయమ్మ (మల్లెల భాగ్యమ్మ)ప్రమాణ స్వీకారంచేసి భాద్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామం లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీలను ముస్తాబు చేసి అందంగా మార్చి ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
కొత్తగూడ మండలంలో ప్రశాంత వాతావరణంలో అటాహసం గా సర్పంచిగా వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను తీసుకున్నారు.




