కర్నూలు : డోన్ : ద్రోణాచలం :
ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, డోన్ పట్టణంలోని ఉమర్ బిన్ ఖాతాబ్ మస్జిద్ సమీపంలో ఈ నెల 27వ తేదీన బాలికల కోసం నిర్వహించనున్న మద్రసా ఫౌండేషన్ కార్యక్రమానికి గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మైనారిటీ విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.




