మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం.
ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించి ఆహ్వానం అందజేసిన ఉరుసు కమిటీ సభ్యులు.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 23.12.2025.
కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి మంగళవారం అందజేశారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు.
ఇస్లాం సంప్రదాయ ప్రకారం శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




