Home South Zone Andhra Pradesh విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఉరుసు ఆహ్వానం

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఉరుసు ఆహ్వానం

0
0

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం*

సంప్రదాయ ప్రకారం చాదర్ సమర్పించాలని కోరిన ఉరుసు కమిటీ సభ్యులు

ఈ నెల 29 30 31 తేదీలలో జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వానాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు అందజేశారు ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు.

ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో కమిషనర్ ను ఇస్లాం సంప్రదాయ ప్రకారం సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం పోలీస్ శాఖ తరఫున బాబా వారికి చాదర్ సమర్పించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది ముక్తార్ అలీ కొండపల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్ సుభాని, ఇబ్రహీంపట్నం మండల టిడిపి మైనార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ బాషా ఉరుసు ఆర్గనైజర్ యూత్ కమిటీ అధ్యక్షులు షమ్స్ తబ్రేజ్ సయ్యద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS