కర్నూలు :
విద్యుత్తు వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి పేర్కొన్నారు.ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్దేశిత గ్రామాలు, పట్టణ వార్డులను సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి.
పరిష్కరించాలన్నారు.ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ 89777 16661కు, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ 73826 14308 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు విద్యుత్తు సమస్యలు చెప్పవచ్చునన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800-425-155333, వాట్సప్ నంబరు 9133331912 ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చునన్నారు.




