పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH–565 పై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్దపులి మృతి చెందింది.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ
విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం నాలుగు పెద్దపులులు ఉన్నాయని,
అందులో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని తెలిపారు.
పులి మృతితో అటవీశాఖలో కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




