మంగళవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కనీసం 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు, మనుషులు కూడా కనిపించనంతగా మంచు కురిసింది. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని, ముందు ఏం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రయాణించాల్సి వచ్చింది.
ఇలాంటి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది
# కే. మురళి.




