Home South Zone Andhra Pradesh మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.

మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.

0
0

అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక అవసరాలకు ఉపయోగపడుతోందని, అలాంటి ఆస్తిపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని ఆమె విమర్శించారు. మైనారిటీలకు చెందిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ, అదే ప్రభుత్వం వాటిని దోచుకునే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో మైనారిటీల హక్కులు, వారి ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఈ పరిణామం రాష్ట్రంలోని అన్ని మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆమె తెలిపారు. ప్రజా ఉద్యమంతో పాటు న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, మైనారిటీల ఆస్తులపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైసిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్. రాష్ట్ర కార్యదర్శి  షేక్ గులాబ్ రసూల్, కార్పొరేటర్లు మెహబూబ్ ,ఆబిద్ ఫర్జానా , రాష్ట్ర మైనార్టీ సెల్ సభ్యులు షేక్ అఫ్సర్, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్, తూర్పు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు లియాకత్ అలీ మరియు తదితరు నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS