Home South Zone Telangana వార్డు 4, 5 బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే గణేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

వార్డు 4, 5 బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే గణేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం వార్డు 5 సింహపురి కాలనీ, వార్డు 4 ఫిషర్ పుర ఎరుకల బస్తీ లలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ , బస్తీల సమస్యలను స్వయంగా పరిశీలించారు.

అనంతరం కాలనీ,బస్తీ వాసులతో మాట్లాడుతూ వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్, సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపిస్తానని,నూతన బోర్ వెల్స్ చేయిస్తానని చెప్పారు.

అలాగే నూతన కరెంట్ పోల్స్, 303 కోట్ల రూపాయలతో చేపట్టబోయే డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా నాలాల అభివృద్ధి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం లభించేలా చూస్తానని కాలనీ, బస్తీ వాసులకు చెప్పడంతో తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపడంతో మీ ఓటు వృధా కానివ్వనని కాలనీ ,బస్తీలను అభివృద్ధి చేసి మీ ఆదరాభిమానాలు చూరగొంటానని ఎమ్మెల్యే వారికి చెప్పారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ, సత్యనారాయణ, మల్లేష్, నాగేందర్ యాదవ్, సంతోష్, ఆనంద్, కిరణ్, బిక్షపతి, విష్ణు, కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, బస్తీ ప్రెసిడెంట్ శశి కపూర్ తదితరులు ఉన్నారు.

#Sidhumaroju

NO COMMENTS