*అమరావతి*
*ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*
• స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
• జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో క్యాలెండర్ రూపొందించిన అసెంబ్లీ సెక్రటేరియట్
• ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించిన అసెంబ్లీ సెక్రటేరీయట్.
• ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన
• సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించిన శాసన సచివాలయం.
• ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనలను చాటిచెప్పేలా 2026 క్యాలెండర్
• 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను చక్కగా డిజైన్ చేశారన్న సీఎం చంద్రబాబు.
• ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించిన ముఖ్యమంత్రి
• క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
• కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్




