*విజయవాడ, డిసెంబర్ 22, 2025*
*ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయం*
– *ఉద్యోగుల సంక్షేమం వైపు మా అడుగులు వేస్తాం*
– *ఏపీ ఎన్‌జీజీవో నగర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక*
– *భారీగా తరలివచ్చిన ఉద్యోగులు*
– *ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్*
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ఎన్‌జీజీవో అడుగులు ముందుకు వేస్తోందని.. సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయబోమని, సానుకూల దృక్పథంతో డిమాండ్ల సాధనకు చిత్తశుద్ధితో కృషిచేస్తామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ అన్నారు.
ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ విజయవాడ నగరశాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్‌జీవో హోంలో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీకి భారీగా ఉద్యోగుల తరలివచ్చారు.
ర్యాలీలో పాల్గొన్న ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ ఎన్నో చారిత్రాత్మాక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. నేడు ఉద్యోగులు పొందుతున్న ప్రతి సౌకర్యం సాధించడం వెనుక కేవలం ఏపీ ఎన్‌జీజీవో అవిరళ కృషి మాత్రమే కారణమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎన్నో అలుపెరగని పోరాటాలు చేయడం జరిగిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఏపీ ఎన్‌జీజీవో సంఘం చేపట్టిన ప్రతి కార్యక్రమం, డిమాండ్ల సాధన పోరాటాలకు విజయవాడ నాందిగా నిలిచి.. విజయాలను చవిచూసిందన్నారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన విజయవాడ నగరశాఖ పాత్ర ఎంతో కీలకమన్నారు. నగరశాఖలో సేవలందించిన ఎంతోమంది అగ్రనాయకులుగా ఎదిగారని..
ఇందుకు కారణం వారు ఉద్యోగులకు అందించిన సేవల్లో అంకితభావం చూపడమేనన్నారు. గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం దశల వారీగా పరిష్కరించేందుకు ముందుకు రావడం ఆశాజనకమన్నారు. గత ఆరు నెలల కాలంలో ఎన్నో సమస్యలను రాష్ట్ర సంఘం ప్రభుత్వం ముందు ఉంచిన తరుణంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.
ప్రధాన ఆర్థిక సమస్యలు, వైద్య సేవలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించే దిశగా ప్రభుత్వం చాలా వేగంగా స్పందిస్తోందన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన 12వ పీఆర్‌సీ ఏర్పాటు, డీఏ బకాయిల విడుదల, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రియింబర్స్‌మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ వంటి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టామని, త్వరలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు.
*నగర శాఖ నూతన కార్యవర్గం:*
ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ విజయవాడ నగరశాఖకు జరిగిన ఎన్నికల్లో 21 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేషన్ దాఖలు కావడం జరిగిందని.. అధ్యక్షునిగా మలేరియా విభాగానికి చెందిన సీహెచ్ సివిఆర్ ప్రసాద్, సహాధ్యక్షులుగా సహకార శాఖకు చెందిన పి.రాజశేఖర్, కార్యదర్శిగా నీటిపారుదల శాఖకు చెందిన ఎస్.కె.నజీరుద్దీన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సాంకేతిక విద్యా విభాగానికి చెందిన సిహెచ్ మధుసూదనరావు, కోశాధికారిగా వ్యవసాయశాఖకు చెందిన డి.ఎస్.ఎన్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పశుసంవర్థక శాఖకు చెందిన ఖాసిం సాహెబ్, పంచాయతీరాజ్‌కు చెందిన ఎం.శ్రీనివాసరావు, ఐటీఐకి చెందిన టి.విద్యాసాగర్, వాణిజ్య పన్నులకు చెందిన
జి.ఎన్.వి రత్నకుమార్, మహిళా విభాగ ఉపాధ్యక్షురాలుగా వైద్యారోగ్య శాఖకు చెందిన బి.విజయశ్రీ, సంయుక్త కార్యదర్శులుగా స్టేడ్ ఆడిట్ శాఖకు చెందిన బి.నాగమల్లేశ్వరరావు, ఆర్ అండ్‌బీకి చెందిన కె. శివశంకర్, ఎన్‌సీసీకి చెందిన జి.అనిల్ కుమార్, ఈఎస్ఐకి చెందిన ఎస్. భాస్కర నాయుడు, జాయింట్ సెక్రటరీగా గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఎస్‌కే మహబూబ్ బాషా, మహిళా విభాగ జాయింట్ సెక్రటరీగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగి బి.శ్వేత, డీఈసి సభ్యులుగా ఏపీజీఎల్ఐకి చెందిన ఎం. రాంబాబు,
ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన జి.మురళి, అటవీశాఖకు చెందిన జి.శ్రీనివాసరావు, గ్రామవార్డు సచివాలయాలకు చెందిన ఎం.శశిధర్, సిద్ధార్థ మెడికల్ కళాశాలకు చెందిన వి.దుర్గాప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వీవీ ప్రసాద్ వెల్లడించారు. సహాయ ఎన్నికల అధికారిగా జి.రామకృష్ణ, పర్యవేక్షకులుగా బి.సతీష్‌కుమార్‌లు వ్యవహరించారు. నూతన కార్యవర్గానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, జిల్లా అధ్యక్షకార్యదర్శులు
డి.సత్యనారాయణరెడ్డి, పి.రమేష్, ఏపీ ఎన్‌జీజీవో మాజీ నాయకులు జి.నారాయణరావు, కంకి సత్యనారాయణ, టి.రాజారావు, ఎండీ ఇక్బాల్, కోనేరు రవి, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.’
