Home South Zone Andhra Pradesh MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల

MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల

0
0

*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం

ఎమ్మెల్యే రాము కృషితో… గుడివాడలో అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల*

*నిత్యం పదివేల మందికి మధ్యాహ్నం భోజనం.. అందించనున్న నూతన భవనం….*

*హోమ పూజల్లో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ,ఎమ్మెల్యే రాము….*

*ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి… భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే రాము*

*అక్షయపాత్ర వంటశాల….గుడివాడలో నిర్మితం కావడం సంతోషకరం:ఎమ్మెల్యే రాము*

*రూ.10 కోట్లతో 1.60 ఎకరాల్లో భవన నిర్మాణానికి సహకరించిన దాతలు ఆదర్శప్రాయులు:ఎమ్మెల్యే రాము*

*నిత్యం దేశవ్యాప్తంగా 23లక్షల మందికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం:ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీధర దాస*

గుడివాడ డిసెంబర్ 23: రుచి,శుచి, పోషకాలతో కూడిన ఆహారాన్ని నిత్యం వేలాదిమంది విద్యార్థులకు అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్ కేంద్ర వంటశాల గుడివాడలో ఏర్పాటు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు.పి 4స్పూర్తితో సంపాదించిన దాంట్లో పదిమందికి ఉపయోగపడేలా భవన నిర్మాణానికి సహకరించిన దాతలు ఆదర్శప్రాయులన్నారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి ఫలితంగా గుడివాడలో అక్షయపాత్ర ఫౌండేషన్ కేంద్రీకృత మధ్యాహ్న భోజన వంటశాల నిర్మాణ పనులు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 1.60 ఎకరాల భూమిలో హరే కృష్ణ మూమెంట్ వారి అక్షయపాత్ర ఫౌండేషన్…రూ.10 కోట్ల నిధులతో నిర్మిస్తున్న కేంద్రీయ మధ్యాహ్న భోజన వంటశాల భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా జరిగాయి.

ముందుగా నిర్వహించిన హోమ పూజల్లో కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే రాము, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని…. పూర్ణహుతిని సమర్పించారు.

అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాము… ఇతర ప్రముఖులు భూ వరాహ పూజలు నిర్వహించి… పలుగుతో భూమిని తవ్వుతూ వంటశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ముందుగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. అత్యాధునిక సాంకేతికతో అక్షయపాత్ర ఫౌండేషన్ కేంద్ర వంటశాల గుడివాడలో ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్లు పి4 కార్యక్రమానికి అనుగుణంగా…. భవన.నిర్మాణానికి సహకరించిన దాతలు వేములపల్లి కోదండ రామయ్య, పువ్వాడ వర్ణలను ఎమ్మెల్యే రాము అభినందించారు.

ఉన్నత విద్యావంతులు, గొప్ప వ్యక్తులు ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్ ఎంతో స్ఫూర్తివంతంగా పనిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నగదు సరిపోకపోయినా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం గొప్ప విషయమన్నారు. గుడివాడలో త్వరగతిన భవననిర్మాణం పూర్తి కావడంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తానని పేర్కొన్నారు.

అక్షయపాత్ర రీజినల్ అధ్యక్షుడు వంశీధర దాస మాట్లాడుతూ…. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు
అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతమైన కేంద్రీయ వంటశాలను ఎమ్మెల్యే రాము ప్రోత్సాహంతో గుడివాడలో ఏర్పాటు చేశామన్నారు.

దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న వంటశాల ద్వారా….గుడివాడ పరిసర ప్రాంతాల్లోని 200 పాఠశాలల విద్యార్థులు నిత్యం పదివేల మందికి మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు.

దాత పువ్వాడ వర్ణ మాట్లాడుతూ…. అమెరికాలో స్థిరపడిన తాను అక్షయపాత్ర సేవలను ప్రత్యక్షంగా చూసానన్నారు. స్వగ్రామం విజయవాడ సమీపంలో గుడివాడలో అనేక ప్రత్యేకతలతో నిర్మితమవుతున్న అక్షయపాత్ర ప్రధాన వంటశాల నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు.

భూమి పూజ కార్యక్రమంలో…. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు గోపాల శాస్త్రి గోవింద, పాల్గుణ దాస,
Vkr vnb విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్
వేములపల్లి కోదండరామయ్య , గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, నందివాడ మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గుడివాడ పట్టణ ప్రముఖులు, అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS