Home South Zone Andhra Pradesh TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి |

TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి |

0

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

గొల్లపూడి – 23 డిసెంబర్ 2025

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్ గారని, ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23ని ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

మంగళవారం గొల్లపూడ కార్యాలయంలో చౌదరి చరణ్ సింగ్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, దేశానికి రైతన్నలు చేస్తున్న సేవలు, మద్దతు ధర, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమానికి సరికొత్త వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై చౌదరి చరణ్ సింగ్.. రైతుల కోసం చాలా చేశారని, వారి హక్కుల కోసం పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

ఆయన రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందువల్ల ఆయన జయంతినే కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. ఆచార్య ఎన్ జి రంగా, చౌదరి చరణ్ సింగ్, దేవీ లాల్ రైతుల హక్కుల కోసం పోరాడి, భారత రాజకీయాల్లో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ప్రముఖులుగా వారి సేవలను స్మరించారు.

రైతు సాధికారత కోసం శ్రీ చౌదరీ చరణ్ సింగ్ ఎంతగానో పరితపించే వారని, ఆయన చూపిన బాటలో పయనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

NO COMMENTS

Exit mobile version