కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం “శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ రాణి ” సత్రంలో నిత్యం మంగళవారం జరిగే మేకల, గొర్రెలు సంతకు ఒక “చరిత్రే”ఉంది.. అలాంటి చరిత్ర ఉన్న మేకల సంతలో అసౌకర్యాలు తిష్ట వేసి రైతులకు మేకలు గొర్రెలకు కనీస సౌకర్యం కల్పించడంలో సత్రం అధికారులు, పంచాయతీ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విఫలం అయ్యారని రైతులు వాపోతున్నారు…
సత్రంకు సంబంధించిన స్థలంలో మేకల సంత జరుగుతూ ఉంటుంది… సత్రం స్థలం పంచాయతీ వారు దశబ్దాలు కాలం నుండి సంవత్సరం సంవత్సరం కొద్ది మొత్తంలో లీజుకు తీసుకుని పంచాయతీ వారు ప్రజలకు తెలియజేసేందుకు డప్పు వేయించి, సంవత్సర కాలానికి ఉన్నత అధికారులు సమక్షంలో పాట నిర్వహించడం జరుగుతుంది.
గతంలో జరిగిన పాట పదిలక్షలు (10,00000) పైగా వేలం పాట జరిగింది… పాట నిమ్మితం డబ్బులు పాటదారు నుండి డబ్బులు వసూలు చేసుకుని చేతులు దులుపు కోవడం తప్పితే పంచాయతీ వారు సంతలో ఎటు వంటి సౌకర్యలు కల్పించడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు..
. ఎండలోనూ, వర్షంలోనూ కూడా రైతులు ఇబ్బందులు గురువుతున్నారు… కత్తిపూడి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విశాఖ జిల్లా, రాష్ట్ర నలుమూల నుండి రైతులు, కొనుగోలు దారులు ఈ సంతకు రావడం జరుగుతుంది..
. సంతలో సుమారు లక్షలాది రూపాయలు లావాదేవీలు జరుగుతాయి… మేకకు 10 వసూలు చేసందుకు పాటలో రేటు నిర్ణయిస్తే పాటదారులు రైతులు వద్ద ఒక్కొక మేక, గొర్రెలు వద్ద 20 రూపాయలు నుండి 30 రూపాయలు బలవంతపు వసూలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఈ సంతలో సుమారు 2000 నుండి 5 వేలు వరుకు మేకలు, గొర్రెలు క్రయ విక్రయాలు జరుగుతాయి…
గ్రామంలో అనేక మంది ఉపాధి పొందతున్నారు.. ఇంత దశబ్దాలు చరిత్ర ఉన్న సంతలో షెడ్డులు నిర్మించి, మంచినీటి సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులను రైతులు కోరుతున్నారు…
#BABJI DADALA




