మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రచ్చబండ్ కార్యక్రమం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఈ వేడుకల్లో వైసీపీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






