కర్నూలు : కర్నూలు జిల్లా కోడుమూరు :
కోడుమూరు పట్టణంలోని ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ పూజా కార్యక్రమంలో గౌరవనీయులు నంద్యాల జిల్లా డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




