Home South Zone Andhra Pradesh రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు |

రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు |

0
0

కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్ కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 36.విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్-01, కెమికల్-10, మెకానికల్-03, ఇన్ స్ట్రుమెంటేషన్-04, సివిల్-01, కెమికల్ ల్యాబ్-02, మెటీరియల్స్-05, ట్రాన్స్‌పోర్టేషన్-01, హ్యూమన్ రిసోర్సెస్-05, ఫార్మసీ-01, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.వయసు: అసిస్టెంట్/డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్/డీజీఎంకు 50 ఏళ్లు, జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు మించకూడదు.వేతనం: అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 50,000 నుంచి రూ. 1,60,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 60,000 నుంచి రూ. 1,80,000, మేనేజర్‌కు రూ. 70,000 నుంచి రూ. 2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ. 80,000 నుంచి రూ. 2,20,000, చీఫ్ మేనేజర్‌కు రూ. 90,000 నుంచి రూ. 2,40,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ. 1,00,000 నుంచి రూ. 2,60,000, జనరల్ మేనేజర్‌కు రూ. 1,20,000 నుంచి రూ. 2,80,000.ఎంపిక విధానం:

షార్ట్ లిస్టింగ్, సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 17.12.2025.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 15.01.2026.ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 22.01.2026.వెబ్‌సైట్: https://www.rfcl.co.in

NO COMMENTS