2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ అమౌంటును వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మంగళవారం నాడు విజయవాడ లబ్బీపేట. కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
హజ్ యాత్రికుల 2024. కన్వీనర్. SM అలీ గారు మాట్లాడుతూ. 2024 సంవత్సరంలో. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి. హజ్ యాత్రికులు. యాత్రకు వెళ్ళినప్పుడు అదనంగా 68 వేల రూపాయలు హాజీలకు భారంగా మారిందని ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.
720 మందికి. సబ్సిడీ నిధులు. విడుదల చేస్తూ. జీవో జారీ చేసినట్లుగా తెలిపారు అనంతరం జరిగిన ఎన్నికలలో. గత ప్రభుత్వం ఓడిపోవడం. అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం. హాజీలకు సబ్సిడీ నిమిత్తం లక్ష రూపాయలు ఇస్తానని. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గత 16 నెలలగా. ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ పెద్దలను.
కలిసిన సబ్సిడీ నిధులు. విడుదల చేయటం లేదని. వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హాజీ లకు హామీ ఇచ్చిన నిధులను మాత్రమే తమ అడుగుతున్నామని ఆ విషయం ప్రభుత్వం గ్రహించాలన్నారు గత ప్రభుత్వం హామీలో భాగంగా 720 మందికి పేరుపేరునా డబ్బులు జమ చేస్తామని జీవో కూడా జారీ అయింది అన్నారు ఎన్నోసార్లు మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్ గారిని కలిసామని కానీ ప్రయోజనం లేదన్నారు .
మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం మాట్లాడుతూ. గత ప్రభుత్వం హాజీలకు. విజయవాడ విమానాశ్రయం నుండి భారంగా ఉన్న నగదును ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని ఉన్నట్లుగానే ఆ సబ్సిడీ నగదును విడుదల చేస్తూ జీవో కూడా విడుదల చేశారన్నారు ప్రభుత్వం మారినా ఇప్పటివరకు వారికి సబ్సిడీ నగదు జమ కాకపోవటం చాలా దారుణమన్నారు .
ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది ముక్తార్ అలీ మాట్లాడుతూ 720 మంది హాజీలకు ప్రభుత్వం సబ్సిడీ నగదు ఇస్తారో లేదో చెప్పాలన్నారు ఆ ప్రకటన వస్తే ఎవరూ కూడా సబ్సిడీ నగదు కోసం ఎదురు చూడరని ప్రభుత్వ వైఖరిపై త్రివ స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు .
కడప గుంటూరు రాయచోటి హైదరాబాద్ తిరుపతి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన హాజీలు పాల్గొన్నారు






