Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి |

ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి |

ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి
వర్ధంతి

*బహుముఖ ప్రజ్ఞాశాలి.‌‌..”భానుమతీ “,
రామకృష్ణ…!!

*సినిమాల్లో తన పాటలు తానే పాడుకునే
వారు‌‌..!!

భానుమతీ రామకృష్ణ
( డీసెంబర్
24, 2005 సెప్టెంబర్ 7 -1926) దక్షిణ భారత సినిమా నటి,నిర్మా
త, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి,రచయిత్రి, గాయని,సంగీత దర్శకురాలు.

ఈమె ఒంగోలులో జన్మించినభానుమతిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, బొబ్బిలి యుధ్ధం, బాటసారి,మంగమ్మ గారి మనవడు ,
పెళ్ళికానుక ,చింతామణి,సారంగధర,విప్రనారాయణ ‘ వంటి అనేకవిజయవంతమైన చిత్రా
లలోనటించారు.ఈమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య.శాస్త్రీయ సంగీత కళాకారు
డు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది.

తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడారు తర్వాత భరణి స్టూడియోస్
బ్యానర్ ద్వారా పలు చిత్రాలు నిర్మించారీ దంప
తులు. భానుమతి రాసిన అత్తగారికథలుతెలు
గు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966…
లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ… పురస్కారం లభించింది.

సినీరంగంలో భానుమతి గారిది విలక్షణ వ్యక్తి
త్వం..‌ఆమె గాత్రం ప్రత్యేకమైంది..తన పాటలు
తానే పాడుకునేవారు..చక్కని నృత్య,సంగీత
కళా కారిణి..

#విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు.

#సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల #సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.

#మిస్సమ్మ, #చెంచులక్ష్మి వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలలో.. ఆమె చివరి నిముషంలో తప్పుకున్నా దర్శక నిర్మాతలు ఆమెకు అహం అని తెగిడినా.. అంజలి,సావిత్రి, జమున వంటి సరికొత్త అందగత్తెలు చిత్ర సీమకు వచ్చినా.. ఆమె ఏ మాత్రం జంకకుండా. పురుషాధిపత్యం కూడిన చిత్ర సీమలో 60 సంవత్సరాలు మకుటం లేని మహా రాణిగా మెలిగారు.. ఆమె రచించిన అత్తగారి కథలు, రంభా చక్రపాణీయం నేటికీ చదువరులను కిత కితలు పెడుతూనే ఉన్నాయి..నాలో నేను అని ఆమె జీవితలోని మరపు రాని మధుర ఘట్టాలను ఎన్నో స్వయంగా రాసుకున్నారు..🌹

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments