Home South Zone Andhra Pradesh ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే |

ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే |

0

సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణాల్లో విజయవంతమైన ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించే ఈ క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చనున్నాయి. ఇప్పటికే లక్షలాది మందికి ఈ పథకం అండగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం 70 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. జనవరి 10లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి.

జనవరి 13 నుంచి 15 మధ్య ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు విజయవంతం అయ్యాయి.. ప్రజల నుంచి ఆదరణ వస్తోంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టణాల్లో 205 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి.. వీటిలో రోజుకు మూడు పూటలా కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు తక్కువ ధరకే భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.

ఒక్కో పూటకు కేవలం రూ.5కే రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు. ఈ పథకం గ్రామీణ ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 205 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇప్పటివరకు 7.20 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేశారు.

ఇందులో మధ్యాహ్న భోజనం చేసిన వారి సంఖ్య 3.16 కోట్లు. ఉదయం అల్పాహారం 2.62 కోట్ల మంది, రాత్రి భోజనం 1.42 కోట్ల మంది తీసుకున్నారు. ఈ క్యాంటీన్లలో విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో పేదలు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని క్యాంటీన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది.

పేదల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశ్యం. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు 7, గుంటూరు 5, శ్రీకాకుళం జిల్లా 5, తూర్పుగోదావరి 4, ఏలూరు 4, ప్రకాశం 4, కర్నూలు 4, విజయనగరం 3, అనంతపుురం 3, అల్లూరి సీతారామరాజు 3, అనకాపల్లి 3, బీఆర్ అంబేద్కర్ కోనసీమ 3, పశ్చిమ గోదావరి 3, కృష్ణా 3, నెల్లూరు 3, అన్నమయ్య 3, కాకినాడ 2, తిరుపతి 2, పార్వతీపురం మన్యం 1, పల్నాడు 1, ఎన్టీఆర్ 1, శ్రీసత్యసాయి 1, నంద్యాల 1, కడప 1 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.

NO COMMENTS

Exit mobile version