Home South Zone Andhra Pradesh కొలచనకోట: ఎస్సీ కార్పొరేషన్ భూముల పరిశీలన

కొలచనకోట: ఎస్సీ కార్పొరేషన్ భూముల పరిశీలన

0

ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి చెందిన భూమి ని పరిశీలించాడానికి వచ్చిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర SC Corporation Chairman శ్రీ పెదాపూడి విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయనకి శాలువా, మొక్క ఇచ్చి ఘన స్వాగతం పలికిన మద్దిపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం మరియూ మండల నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు ముప్ఫై సంవత్సరాల క్రితం కోళ్లఫారాల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు ఆరున్నర ఎకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఆ భూమి నిరుపయోగ స్థితిలో బీడు భూమిగా మారిపోయింది. ఆ భూమిని పరిశీలించి, నాటి లబ్ధి దారులతో సంభాషించారు. స్థానిక MRO గారు, VRO, VS, VRA తో మాట్లాడి ఆ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో ఈ భూమిని వినియోగంలో తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version