సికింద్రాబాద్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. గంటల వ్యవధిలో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రైస్తవ సోదరులు షాపింగ్ ల తో బిజీ బిజీగా మారిపోయారు.
ముఖ్యంగా ఈ రోజు కోసం వారు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశకయోక్తి లేదు.
క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందుగా అనగా నేటి రాత్రి 11గంటలకే తమ తమ చర్చిలు వద్దకు చేరుకొని ప్రార్థనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తెలుతారు. ఒకరికొకరు కరచాలనం, ఆలింగనాలూ చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొని అర్ధరాత్రి 12 గంటల తరువాత తమతమ నివాసాల వద్దకు వెళ్లి ఇళ్లముందు రంగురంగుల హరివిల్లులతో అందంగా తీర్చిదిద్దుతారు.
ముఖ్యంగా క్రైస్తవులంతా దాదాపు 10 రోజుల ముందునుండే ఇళ్ల వద్ద స్టార్ (విద్యుత్ దీపాల నక్షత్రాన్ని) ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు రాత్రుళ్లు తమతమ చర్చిల సభ్యుల ఇళ్ళవద్దకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఇవి డిసెంబర్ 31వరకు కొనసాగిస్తారు.
సర్వమానవ సౌబ్రాతృత్వం, శాంతిని కాంక్షిస్తూ దేవదేవుడ్ని ప్రార్థిస్తామని క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు తెలిపారు.
#sidhumaroju





