గుంటూరు జిల్లా పోలీస్…
నగరం పాలెం పోలీస్ స్టేషన్.
గంజాయి కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్. – 1200 గ్రాముల గంజాయి స్వాధీనం,.//*_ 📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం సీఐ శ్రీ Y. సత్యనారాయణ గారు మరియు వారి సిబ్బంది గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయంపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సాయంత్రం 7.30 గంటలకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని VIP రోడ్ నుండి లాలుపురం వెళ్లే డొంక మధ్యలో, శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి గుడి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయని సీఐ సత్యనారాయణ గారికి రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడి నిర్వహించి అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారిని విచారించి, వారి వద్ద ఉన్న 1200 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించి.
Cr.No: 492/2025 U/s 8(c) r/w 20(b)(ii)(B) NDPS Act–1985 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 💫 *అరెస్ట్ అయిన నిందితుల వివరాలు :* 1. చంద్రావలి యాదవ్, తండ్రి: ముకిలేష్ యాదవ్, వయసు: 31 సం., నివాసం: KVP కాలనీ, శ్మశానాల వెనుక బజార్, గుంటూరు టౌన్. 2. దేవానంద్ మూకీయ, తండ్రి: జగదీష్ మూకీయ, వయసు: 38 సం., నివాసం: KVP కాలనీ – 1వ లైన్, గుంటూరు టౌన్. 3. వల్లెపు. హరికృష్ణ, తండ్రి: వెంకట రావు, వయసు: 19 సం., నివాసం: KVP కాలనీ – 0వ లైన్, గుంటూరు టౌన్. *ఇంకా ఈ కేసుకు సంబంధించిన మరికొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉన్నది.* *💫 కేసు వివరాలు :* * A1 మరియు A2 లు బీహార్ రాష్ట్రానికి చెందినవారు.
జీవనోపాధి నిమిత్తం గుంటూరుకు వచ్చి KVP కాలనీలో నివసిస్తూ, మిర్చి యార్డ్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వారికి గుంటూరుకు చెందిన వల్లెపు హరికృష్ణ (A3) పరిచయం అయ్యాడు. * ముగ్గురు కలిసి తిరుగుతూ మద్యం, సిగరెట్, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలయ్యారు. తమ అవసరాలకు డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి విక్రయాల ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
* A1 తన స్వగ్రామమైన బీహార్ నుంచి గుంటూరుకు వచ్చేటప్పుడు గంజాయిని తీసుకువచ్చి, ముగ్గురు కలిసి వాటిని పంచుకుని తమకు తెలిసిన వ్యక్తులకు మరియు దారినపోయే వారికి విక్రయిస్తూ, వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు. * అలా గంజాయి పంచుకుంటున్న సమయంలో, 22.12.2025 సాయంత్రం 7.30 గంటలకు పై పేర్కొన్న ప్రదేశంలో పోలీసులచే పట్టుబడగా, వారి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేయడమైనది. 📌 కేసు దర్యాప్తులో పాల్గొన్న CI సత్యనారాయణ గారిని, SI D. ప్రసన్న కుమార్ గారిని, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్ బాబు మరియు ఎం. దాసు గారులను, కానిస్టేబుళ్లు ఎస్. శ్రీనివాస్, ఉదయ్, పి. గంగరాజు మొదలగు వారిని వెస్ట్ డిఎస్పీ గారు అభినందించారు.
ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రయం, వినియోగం, రవాణా లేదా కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారు హెచ్చరించారు.అలాగే బీహార్, ఒరిస్సా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులు వారి పట్ల బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
