Home South Zone Andhra Pradesh రక్తదానం అంటే ప్రాణదానం – ఎస్పీ |

రక్తదానం అంటే ప్రాణదానం – ఎస్పీ |

0

కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్  కానిస్టేబుల్ చిన్న సుంకన్నఅభినందించి శాలువతో సన్మానించిన… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు. రక్తదానం… ప్రాణ దానంతో సమానం… సేవా భావంతో పని చేయడం అభినందనీయం…

జిల్లా ఎస్పీరక్తదానం చేయడం అంటే  ప్రాణదానం చేయడం లాంటిదని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు. కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  చిన్న సుంకన్న  50  సార్లు  రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం అభినందించారు.

శాలువ , పూల మాలతో సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు. పోలీసు శాఖలో  విధులు నిర్వహిస్తూ , సేవాభావంతో  రక్తదానం చేయడం  అభినందనీయమని జిల్లా ఎస్పీ  గారు  కొనియాడారు.2011 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్. స్వస్ధలం కర్నూలు , బుధవారపేట .

ఈయన కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుండి ఎవరైనా అత్యవసర సమయములలో పోలీసులకు ,ప్రజలకు, గర్భవతులకు వివిధ సమస్యలతో హాస్పిటల్స్ చేరిన వారికి  వెంటనే స్పందించి రక్తదానం చేయడమే కాక అనేక మందిని రక్తదాతలుగా ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్ , కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు ఉన్నారు.

NO COMMENTS

Exit mobile version