కర్నూలు :
నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం :
డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, త్రాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్, సంక్షేమ పథకాలు వంటి అనేక అంశాలపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్నారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాతపేట ప్రాంతంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయే వారం పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే రైల్వే గేట్ల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్‌కు సంబంధించిన ర్యాంప్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు సమానంగా చేపడతామని తెలిపారు.






