కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే బ్రిడ్జి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులో డ్రైనేజీ నుండి నిత్యం దుర్వాసనతో కూడిన మురికినీరు రోడ్డుపై పారుతూ ఉండటం వలన ప్రజాఆరోగ్య సమస్యలు ఎదురు అవుతూనే ఉన్నాయి…
ఈ రోడ్డు ఎప్పుడూ వాహనాలతో, ప్రజలతో నిత్యం రద్దిగా ఉండే ప్రాంతం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎక్కువుగా ఉంటాయి … కత్తిపూడి నుండే వివిధ గ్రామాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు మార్గనే ప్రయాణించాల్సి ఉంటుంది.. గ్రామంలో కూడా సుమారు 20,000 వేల జనాభా కలిగి ఉండటంతో ఏ అవసరం వచ్చిన ఈ మురికి నీటి మార్గనే దాటుకుని నిత్యావసర వస్తువులు కాని, టిఫిన్ సెంటర్ కాని, మెడికల్ అవసరాలు కానీ, కాలేజీకి వెళ్లే విద్యార్థులు.
ఉద్యోగాలకు వెళ్లేవారు, పొట్టకూటికోసం పోయే కూలీలు, వ్యాపారాస్తులు, ప్రజలు తరుచూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు… మరీ ముఖ్యంగా ఈ దారిలోనే ఉన్న హైస్కూల్ కి వెళ్లే విద్యార్థులు చదువుకునేందుకు వెళ్ళేటపుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఆ మురికి నీటిలో జారుపడుతూ నరకాయతన పడుతున్నారు..
ఈ సమస్యను అనేకసార్లు నేషనల్ హైవే వారికీ తెలియజేసిన తుతూ మంత్రంగా సమస్యను చూస్తున్నారే తప్ప శాశ్వత పరిస్కారం చూపిస్తాలేదని ప్రజలు, బాటసార్లు, వాహనదారులు వాపోతున్నారు…
మేజర్ పంచాయతీ అధికారులకు తెలియజేసిన ఇది మా పరిధి కాదు హైవే అధికారులు పరిష్కరించాలని చేతులు దులుపుకుంటున్నారు… నిత్యం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ రోడ్డు మార్గాన్నే ప్రయాణిస్తున్న చూసి చూడనట్లు, పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు..
దయవుంచి డ్రైనేజీ నుండి దుర్వాసనతో వచ్చే ఈ మురికి నీటి సమస్యను పరిష్కరించక పొతే వర్షకాలంలో మరింత అద్వానంగా మారి గ్రామంలో ప్రజలు రోగాలు బారిన పదే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజలు తెలియజేస్తున్నారు.. ఇప్పటికయినా సమస్యకు పరిస్కారం చూపాలని ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, నేషనల్ హైవే ఆధారిటీ వారిని, పంచాయితీ అధికారులను వేలాది ప్రజానీకం వేడుకుంటున్నారు…
#BABJI DADALA




