మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నీతన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలోగోల్డ్, వేపన్ నన్ చాక్ విభాగం లో గోల్డ్ తో పాటు ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన నాలుగవ ఇంటర్నేషనల్ కరాటే పోటీలో చాంపియన్ అయిన సిరి కరాటే మాస్టర్ రెంజుకి షోటోకన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షులు
నగేష్ తెలిపారు ముంబై లోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 4వ ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు సుమారు 4000 మంది 12 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను వొడోరియో కరాటే నిర్వహించినట్టు ఆయన
తెలిపారు.ఏదేమైనా మెదక్ జిల్లాకు గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని సిరి తెలిపారు. స్థానిక కలెక్టర్ రాహుల్రాజ్ చేతుల మీదుగా గోల్డ్ తో పాటు చంపియన్షిప్ కైవసం చేసుకున్న సిరిని శాలువతో సత్కరించారు.






