Wednesday, December 24, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు |

మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు |

*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు*

*ప్రేమ–శాంతి సందేశమే మానవాళికి దిశానిర్దేశం*

*శాంతి, సేవ, ప్రేమే క్రీస్తు చూపిన బాట*

*ప్రేమ తత్వంతోనే సమాజానికి శాంతి*

మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెమీ క్రిస్మస్ వేడుకలకు మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ అధ్యక్షత వహించి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు
.ఈ సందర్భంగా ఫాదర్ సత్య ప్రకాష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, త్యాగం, శాంతి మార్గం సమాజానికి అవసరమని పేర్కొన్నారు…..

*ఈ సందర్భంగా మంగళగిరి గ్రామీణ సీఐ బ్రహ్మం* మాట్లాడుతూ, యేసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశం విశ్వసోదరత్వమని తెలిపారు. ద్వేషం, హింస, అసహనం పెరుగుతున్న నేటి సమాజంలో క్రీస్తు చూపిన ప్రేమ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. పేదల పట్ల కారుణ్యం, బాధితుల పట్ల సానుభూతి, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడడమే నిజమైన క్రైస్తవ విలువలని వివరించారు…..

*తాడేపల్లి సీఐ వీరేంద్ర* మాట్లాడుతూ, యేసుక్రీస్తు తన జీవితాన్ని మానవాళి శ్రేయస్సుకోసం అంకితం చేశారని గుర్తు చేశారు. పాపులను కూడా క్షమించమని బోధించిన క్రీస్తు సందేశం నేటి తరం మనుషులకు మార్గదర్శకమని తెలిపారు. శాంతి, సమానత్వం, మానవతా విలువలు సమాజంలో నిలబడాలంటే క్రీస్తు బోధలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు…..

*మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్* మాట్లాడుతూ, క్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన బోధించిన మానవతా విలువలు, సోదరభావం, శాంతి మార్గం ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలన్నారు..ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ వంటి శాశ్వత విలువలను అందించిన ఏసుక్రీస్తు సందేశం ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకమని ఆయన అన్నారు. క్రీస్తు బోధించిన ప్రేమ తత్వం సమాజంలో శాంతి కి బలమైన పునాదిగా నిలుస్తోందని

పేర్కొన్నారు..స్నేహ మార్గాన్ని అనుసరిస్తూ పరస్పర గౌరవం, సహకార భావాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈర్ష్య, ద్వేషాలు సమాజాన్ని విభజించే శక్తులని, వాటికి దూరంగా ఉండి మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రేమతో కూడిన జీవన విధానమే ప్రపంచానికి నిజమైన శాంతిని అందిస్తుందని చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ప్రజలతో స్నేహపూర్వకంగా

మమేకమై,శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.అనంతరం క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును డీఎస్పీ మురళీకృష్ణతో పాటు సీఐలు, ఎస్ఐలు కలిసి కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ ను గ్రామీణ సీఐ బ్రహ్మం

, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ లు ఘనంగా సత్కరించారు. డీఎస్పీ మురళీకృష్ణ గ్రామీణ సీఐ, ఎస్సై, తాడేపల్లి సిఐను శాలువాతో సత్కరించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments