బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని పడగొట్టిన అల్లరి మూకలు ఇప్పుడు హిందువులపై కూడా దాడి చేస్తున్నారు.. బంగ్లాదేశ్ లో ఇంత జరుగుతున్న మొహమ్మద్ యోనస్ లీడ్ చేస్తున్నాన ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది.
అక్కడి అల్లరి మూకలు ఇండియన్ హై కమీషన్ పై కూడా దాడి చేశారు, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ భారత వ్యతిరేక భావజాలని విపరీతంగా ప్రచారం చెస్తున్నారు. 1971 లో ఇండియా పాకిస్తానీ కి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ద్వారా బంగ్లాదేశ్ కి వియోచన లభించింది అన్న విషయం చెస్తున్నా షరీఫ్ ఉస్మాన్ హద్దీ అనే వ్యక్తిని కొందరు కాల్చి చంపడం తో అల్లర్లు మరింత ఎక్కువయ్యి .
బంగ్లాదేశ్ లో ఒక హిందూ కార్మికుని దారుణంగా కొట్టి అతను ప్రాణాలతో ఉన్నపుడే నడి వీధిలో వందల మంది సమక్షంలో ఒక చెట్టుకి వేలాడాదీసి కాల్చి చంపడం అనేది ప్రతి ఒక్క భారతీయుని విపరీతంగా బాధిస్తున్న అంశం కానీ ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల వెనుక చాలా లోతైన కారణాలు ఉన్నాయి.
బంగ్లా రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలనీ దృష్టిలో ఉంచుకొని ఈ అలర్లని సృష్టించాయి.2026 Feburary లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చెలరేగిన ఈ అల్లర్లు ఎన్నికలు వాయిదా వేసేవరకు ఆగేలా లేవు.. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ అల్లర్ల లో ఇన్వాల్వ్ అయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అల్లర్లు ఇంకా కొనసాగొచ్చు అని అనుకుంటున్నారు నిజ నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది …
