Home South Zone Andhra Pradesh మెడికల్ కాలేజీల PPPపై ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్యలు |

మెడికల్ కాలేజీల PPPపై ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్యలు |

0
1

మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రజలు ఆలోచించండి.
సంతకాల పేరుతో సైకోల మాటల నమ్మకండి * జగన్ ను కాంట్రాక్టర్లు నిలదీస్తారనే సంతకాల డ్రామా * గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ * రూ.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై రాష్ట్రంలో మేధావులు ఆలోచించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు.

గుంటూరు తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో మంగళవారం రూ.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.7.80 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించామని వెల్లడించారు.

ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యంతోపాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా తోడుగా నిలుస్తాన్నామన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిలదీస్తారనే భయంతో సంతకాల సేకరణ డ్రామాకు తెరతీశారన్నారు.

హైవే రోడ్లు, డ్యాములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన వాటిని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తూ ఉంటామని, ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలనూ పూర్తి చేసేందుకు పీపీపీ విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పూర్తయ్యాక మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వస్తాయన్నారు. జగన్ ఐదు కాలేజీలు నిర్మించడానికి ఐదేళ్లు సరిపోలేదని, తాము రెండు, మూడేళ్లలో 19 కాలేజీలు పూర్తి చేస్తామని వెల్లడించారు.

కాలేజీలు నిర్మి్స్తామని చెప్పిన వారిని జైలులో పెడతామని నిస్సిగ్గుగా జగన్ మాట్లాడటం దారుణమన్నారు. రాజ్యాంగంపైగానీ, చట్టాలపైగానీ ఎటువంటి నిబద్ధత లేదని మండిపడ్డారు. జగన్ బర్త్ డేకు పొట్టేలు కోసి ఫ్లెక్సీలపై రక్తం వేస్తుంటే, అదే తమ నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి మంచి చేయాలని చెబుతున్నారని, ఈ తేడాను ప్రజలను గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

NO COMMENTS