Home South Zone Andhra Pradesh వెంకటరమణ కాలనీలో వ్యభిచార అరెస్టులు |

వెంకటరమణ కాలనీలో వ్యభిచార అరెస్టులు |

0

*గుంటూరు జిల్లా పోలీస్…*
*టాస్క్ ఫోర్స్ రైడ్* _*//నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్డ్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం,.//*_

మధ్యాహ్నం సుమారు 01:20 గంటల సమయంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ 4వ లైన్ ప్రాంతంలో ఆర్గనైజ్డ్ వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన విశ్వసనీయ సమాచారాన్ని SB CI–1 గారికి తెలియజేసి, నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ సత్యనారాయణ గారి దిశానిర్దేశంలో రైడ్ చేసి, వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఒక ఆర్గనైజర్‌తో పాటు ఒక మహిళ మరియు ఒక పురుషుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
వారి వద్ద నుండి మూడు (03) సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 📌 నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, వెస్ట్ డీఎస్పీ శ్రీ అరవింద్ గారి పర్యవేక్షణలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ శ్రీ సత్యనారాయణ గారు తెలిపారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version