ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే.. అతనితో మాట్టాడటమో, లేదా కాసేపు సమయం గడపడమో చేయాలి.. ఇద్దరి మధ్య జరిగిన కాస్త సంభాషన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వాడనేది తెలుసుకోవచ్చు. అదే కాదు ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది చేతిరేఖలు,శరీరభాగాల ఆకారం ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి వారని అంచనా వేస్తారు. అలానే మన చేతి వేళ్ల ఆకారన్ని బట్టి కూడా వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో అదెలాగో చూద్దాం.
సాధారణంగా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే.. అతనితో కాసేపు మాట్లాడం ద్వారానో లేదా అతనితో పరిచయం పెంచుకోవడం ద్వారానో అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి శరీరభాగాల ఆకారాన్ని బట్టి కూడా వారి వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయవచ్చని ఎంతమందికి తెలుసు. అవును మీరు వింటున్నది నిజమే.. వ్యక్తిత్వ పరీక్షలో భాగంగా ఒక వ్యక్తి చేతి వేళ్లు, కాలి వేళ్లు, కన్న, ముక్క, చేవి ఆకారాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో మన చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్లమని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
మీ చేతివేళ్ల ఆకారమే మీ వ్యక్తిత్వం
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉన్నవారు
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉన్న వ్యక్తులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారట. అలాగే వీరు అందరితో ఈజీగా కలిసిపోతారట. వీరు ప్రతి విషయంలో కొంచెం దూకుడుగా ఉండి.. క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారట. అంతేకాదు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమ తోటి ఉద్యోగుల కంటే ఎక్కువడ డబ్బును సంపాదిస్తారట.
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉన్నవారు.
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉన్నవ్యక్తులు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారట. అలాగే కొంచెం నార్సిసిస్టిక్‌గా కూడా ఉంటారట.అలాగే వీళ్లు అందరితో కాకుండా ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతారట. కానీ వీరు ప్రేమ విషయంలో మాత్రం అవతల వారినీ ఈజీగా నమ్మరు. త్వరగా వారితో కలిసిపోరు.
ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానంగా ఉండే వ్యక్తులు
ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానంగా ఉండే వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారట, ఇద్దరి మధ్య గొడవ జరిగితే వీరు ఈజీగా వాటిని సాల్వ్ చేసే లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాదు వీరు ఎవరైనా నమ్మితే వాళ్లను ఎప్పటికీ మోసం చేయరట. ప్రేమించిన వారితో కూడా చాలా నమ్మకంగా ఉంటారట.ఇలాంటి వారితో ప్రతి విషంలో జాగ్రత్తగా ఉంటారు. చేసే పనిలో ఎలాంటి పొరపాటు రాకుండా చూసుకుంటారు. అలాగే వీళ్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.
#Sivanagendra #Health&Fitness #Bharataawaz
