Home South Zone Andhra Pradesh నేర నియంత్ర నే పోలీసు ల ప్రథమ కర్తవ్యం !! జిల్లా ఎస్పీ

నేర నియంత్ర నే పోలీసు ల ప్రథమ కర్తవ్యం !! జిల్లా ఎస్పీ

0

కర్నూలు :కర్నూలు జిల్లా…నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేయాలి.రౌడీషీటర్ల లోకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ల్యాండ్ మాఫియా చేసే వారిపై  కేసులు నమోదు చేయాలి.కేసులు చేధించి రికవరీలు బాగా చేయాలి…బాధితులకు న్యాయం చేయాలి. వచ్చే  నూతన సంవత్సరంలో అందరూ బాగా పని చేసి జిల్లా కు మంచి పేరు తీసుకురావాలి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం .

నేర నివారణే లక్ష్యంగా పని చేయాలని,  ఎపి రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు  రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి లోకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులకు   జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు తెలిపారు. దొంగతనాలు, ప్రాపర్టీ కేసులు చేధించి , రికవరీల శాతాలను బాగా  పెంచాలన్నారు.

ఈ సంధర్బంగా  మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో  మాట్లాడారు.సంవత్సారాంతం వస్తున్నందున రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.జనవరి నుంచి ప్రతి రౌడీషీట్స్ ను , సస్పెక్ట్ షీట్స్ లను   మొత్తం సమాచారం (  ఫోటోలు, ఆధార్ , బ్యాంకు వివరాలు,  లొకేషన్స్ జియో ట్యాగింగ్ , ఫోన్ నంబర్స్  )  సిసిటీఎన్ఎస్ లో అప్ లోడ్ చేయాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఎక్కువ కేసులు నమోదై ఉన్న వారి పై జిల్లా బహిష్కరణ , పీడి యాక్ట్ లు నమోదు  చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ఉద్యోగాల పేరుతో మోసాలు, ల్యాండ్ మాఫియా చేసే వారిపై కేసులు నమోదు చేయలన్నారు.2015 నుండి 2025 వరకు (10 సంవత్సరాల నుండి)  ఎలాంటి కేసులు నమోదు కాకుండా,  సమస్యలు లేకుండా ఉన్న రౌడీ షీటర్ల ను బాగా రివ్యూ చేయాలన్నారు.

మంచి నడవడిక  కలిగిన  రౌడీ షీటర్ లను రౌడీ షీట్ నుండి తొలగించే విధంగా చూడాలన్నారు.   రోడ్డు ప్రమాదాలను బాగా తగ్గించాలన్నారు.  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి  , జిగ్ జాగ్ డ్రమ్స్,  స్పీడ్ బ్రేకర్స్, బ్లింకర్స్  ఏర్పాటు చేయించాలన్నారు.పెండింగ్ కేసులు తగ్గించాలన్నారు.ప్రాపర్టీ , దొంగతల కేసులను  చేధించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

మహిళల పై నేరాల జరగకుండా  నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల ను ఆశ్రయించే బాధితులకు న్యాయం చేయాలన్నారు. పోక్సో , బాలికల మిస్సింగ్  , గ్రేవ్ కేసుల గురించి  అడిగి తెలుసుకున్నారు.వచ్చే నూతన సంవత్సరం నుండి అందరూ బాగా పనిచేయలన్నారు.  జిల్లా కు మంచి పేరు తీసుకురావాలన్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్,  ఓపెన్ డ్రింకింగ్ ల పై స్పెషల్  డ్రైవ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి కేసులో ఈ సాక్ష్య యాప్ ను బాగా వినియోగించాలన్నారు.ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు తో  పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారు.ప్రోబేషనరీ ఎస్సైలు  బాగా పనిచేయాలన్నారు.కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్ కు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.   విజిబుల్ పోలీసింగ్ బాగా చేయాలన్నారు. ఉలిందకొండ పరిధిలో ఎటిఎం చోరికి ప్రయత్నించిన కేసులో డిజిపి గారి నుండి ఎబిసిడి అవార్డు పొందిన పోలీసులను,  గత నెలలో వివిధ కేసులలో  ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు,  సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

ఈ నేర సమీక్ష వేశంలో   అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు,  డిఎస్పీలు  బాబు ప్రసాద్ , వెంకట్రామయ్య , హేమలత,   భార్గవి ,  సిఐలు,  ఎస్సైలు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version