కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
పశుసంవర్ధక శాఖ వైద్యులు చిరుత మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.




