మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ ( కాలమానిని) ఆవిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్ కుమ్మరి గూడ లోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో సత్సంగ్ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై క్యాలెండర్ (కాలమానిని) ను ఆవిష్కరణ చేసి లలితా సత్సంగ్ కమిటీ సభ్యులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు .
క్యాలెండర్ ఆవిష్కరణకు దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద పండితులచే ఘనంగా ఆశీర్వచనం ఇప్పించారు.
ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వాగతం పలికిన వారిలో ఇ.ఓ రవికాంత్, సత్సంగ్ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, రుక్మిణి, అరుణ, టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వీరలక్ష్మి, కుమారి, ప్రభావతి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, శేఖర్ ముదిరాజ్,టెంపుల్ కమిటీ చైర్మన్ లు ప్రభాకర్ యాదవ్, వెంకట్రాజు, తదితరులు ఉన్నారు.
#sidhumaroju
