Home South Zone Andhra Pradesh లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం |

లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం |

0

*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*

*మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్‌కు ప్రశంసా పత్రం*

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుని, లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసులను పరిష్కారానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గౌరవం లభించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, రూరల్ ఎస్సై వెంకట్ అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ప్రశంసించారు. న్యాయ ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, అంకితభావంతో పనిచేసినందుకే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు, డీఎస్పీ మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల శాంతి, భద్రతలే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version