కర్నూలు : ఆంధ్రప్రదేశ్ 104 MMU ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నేత ఎస్.వి. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి కార్మికులకు, ఉద్యోగులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 MMU ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.తగ్గించిన వేతనాలు వెంటనే పునరుద్ధరించాలి, బకాయి వేతనాలను చెల్లించాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి, PF, ESI వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం వైఎస్ఆర్సిపి ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ ధర్నాలో 104 MMU ఉద్యోగులు, యూనియన్ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.




