Home South Zone Andhra Pradesh CSS నిధుల పూర్తి వినియోగంపై కలెక్టర్ ఆదేశం |

CSS నిధుల పూర్తి వినియోగంపై కలెక్టర్ ఆదేశం |

0

సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు.

వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version