గుంటూరు జిల్లా పోలీస్…*
తేది: 23.12.2025*
_*//రోడ్డు ప్రమాదాలు మరియు మాదక ద్రవ్యాల నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించండి.- గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారు,.//*_
*”సంకల్పం” మరియు “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించండి.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు,.*_
ఈరోజు(23.12.2025) జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో “నవంబర్ – 2025” నెలకు సంబంధించి నిర్వహించిన “నేర సమీక్ష సమావేశం”లో పాల్గొని జిల్లా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన గుంటూరు రేంజ్ ఐజీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు.
ఈ సమావేశంలో జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగులో ఉన్న కేసుల విచారణ పురోగతి, రోడ్డు ప్రమాదాలు మరియు మాదక ద్రవ్యాల నివారణ చర్యలు, రౌడీషీటర్లు, ఇతర నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, PGRS ఫిర్యాదుల పరిష్కారం, ప్రజలు పోలీస్ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలు మొదలగు పలు అంశాల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఐజీ గారు మాట్లాడుతూ…*
* ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు రెండు పూటల పోలీస్ సిబ్బందికి రోల్ కాల్ (Roll Call) నిర్వహించి, వారు చేస్తున్న విధుల గురించి సమీక్ష నిర్వహించాలి.
* PGRS లో వచ్చే ప్రజల ఫిర్యాదులకు సత్వర నాణ్యమైన పరిష్కార చర్యలు చూపించండి.
* రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.
* ప్రతి పోలీస్ స్టేషన్లో ముఖ్యమైన 10 మంది రౌడీ షీటర్లను ఎంపిక చేసి, వారిపై నిఘా ఉంచి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
* ప్రతి ఒక్క పోలీస్ అధికారి నూతన చట్టాలపై విస్తృత అవగాహన కలిగి ఉండాలి.
* మాదక ద్రవ్యాల నివారణ కొరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.ఏ వ్యక్తిపై అయిన ఒక్క మాదక ద్రవ్యాల కేసు నమోదైనా అతనిపై తప్పకుండా సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలి.
* ఇతర నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, న్యాయ స్థానాల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.
* ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలి
ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతూ…*
•ప్రతి ఒక్క పోలీస్ అధికారి రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తగిన ప్రణాళికలు రూపొందించుకుని, ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు, జిగ్జాగ్ లైన్లు, మొబైల్ స్టాప్ బోర్డులు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసుకోవాలి.రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* సర్వీస్ రోడ్డు నుండి హైవే రోడ్డులోకి ద్వి మరియు త్రీ చక్ర వాహనాలు ప్రయాణించకుండా చూస్తూ, హెల్మెట్ ధరించడం మరియు సీటు బెల్ట్ పెట్టుకోవడం, ఇతర రోడ్డు నియమాలు పాటించని వారిపై ప్రతి రోజు ఉదయం 11 గం.ల నుండి మధ్యాహ్నం 01:00 గం.ల వరకు, మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ, నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
* PGRS కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలి.మరల ఆ ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
* 60, 90 రోజుల వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసులను వేగంగా పూర్తి చేసి, న్యాయస్థానంలో ప్రాథమిక ఛార్జిషీట్ సమర్పించాలి.
* శక్తి కాల్స్ అందిన వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకొని పరిష్కారం చూపించాలి.
* పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్ మరియు మాదక ద్రవ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారితో ప్రతీ వారానికి సమావేశాలు నిర్వహించి గ్రామాలు/వార్డుల శాంతి భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై సమీక్ష చేయాలి.
* విద్యార్థులకు స్వీయ రక్షణ చర్యలకు సంబంధించి వారికి అవసరమైన ప్రాణ రక్షణ విద్యలను మంచి సుశిక్షితులైన వారితో నేర్పించాలి.దానికి సంబంధిత విద్యాలయ యాజమాన్యం వారి సహకారం తీసుకోవాలి.
* డయల్ 100, 112 ద్వారా అందే కాల్స్‌కు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలి.
* అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో అనవసరంగా తిరుగుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* రాత్రిపూట అనుమానాస్పదంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకొని సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలు పరిశీలించాలి.వారి వేలిముద్రలతో పాటు వివరాలను కూడా పోలీస్ డేటా బేస్ లో నమోదు చేయాలి.
* Drunk & Drive, Open Drinking తనిఖీలను ప్రతిరోజూ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, రాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలి.
* ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ గస్తీ నిర్వహించి, నిర్మానుష్య ప్రదేశాలు, గుబురు చెట్లు ఉన్న ప్రాంతాలు, విడిచిపెట్టిన భవనాలను పర్యవేక్షించి, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలి.
* చీకటి, జనసంచారం లేని ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ సమన్వయంతో లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయించాలి.
* రౌడీషీటర్లపై నిఘా ఉంచి, తరచూ నేరాలకు పాల్పడే వారిపై కొత్త రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి.
* పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను CCTNS లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి; ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీ నిర్వహించాలి.
* సాంకేతిక పరికరాలను వినియోగించి పరారీలో ఉన్న నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనాలి.
జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగులో ఉన్న పలు రకాల ఫైళ్ళను త్వరితగతిన పూర్తి చేసి, పలు రకాల ఎంక్వైరీలను పూర్తి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ GV రమణమూర్తి గారు కూడా పోలీస్ అధికారులకు సూచించారు.
పలు నేరాలను చేధించడంలో, లోక్ అదాలత్ లో పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించడంలో, శాంతి భద్రతల సమాచారాన్ని సేకరించడంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కనిపెట్టడంలో విశేష ప్రతిభ కనబరచిన పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు ప్రశంసా పత్రాలు అందించి, అభినందించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీలు శ్రీ జి.వి. రమణమూర్తి గారు (అడ్మిన్) శ్రీ ఏ. హనుమంతు గారు (AR),డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




