మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం మహబూబాబాద్.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయము రూమ్ నెంబర్ S-4 సెకండ్ ఫ్లోర్ నందు నిర్వహిస్తున్నామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. ధర్మేందర్ ప్రకటనలో తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కొరకు 9000284353 నెంబర్ నందు సంప్రదించగలరని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీ ధర్మేందర్ పేర్కొన్నారు.





