మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులలో సమూల మార్పులు జరుగుతాయి అన్నారు.చేగుంట గ్రామపంచాయతీకి కొత్త భవనం.
చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 38 మందికి గాను 3,804,408 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలైతున్నాయి అన్నారు.అర్హత గల వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరిత గతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.వచ్చే సంవత్సరానికి నియోజకవర్గానికి మరో 3,500 ఇండ్లు మంజూరు
చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.పోయిన విద్యా సంవత్సరానికి 50,000 మంది టీచర్లను భర్తీ చేశామని కొత్త రేషన్ కార్డులు 200 యూనిట్ల కరెంటు సన్న బియ్యం లాంటి మహత్తర కార్యక్రమాల అమలైతున్నై అన్నారు.పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి తో నిన్న సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.




