బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తుంది అన్నారు. మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు.
సిబ్బంది విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎం మాధవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏడిఎస్డి ఇంచార్జ్ రవికిరణ్, సౌగంధి హారిక పాల్గొన్నారు.
#నరేంద్ర






