గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…
గురువారం అమరావతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని,దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా, మాజీ ప్రధాని గౌరవ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా అమరావతిలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అటువంటి మహానేత విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయటం రాష్ట్రానికి, అమరావతి భవిష్యత్తుకు ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో తాము అందరం కలిసి అమరావతికి తరలివెళ్తున్నామని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, ఎన్డీయే కూటమి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.
అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవలను స్మరించుకుంటూ, అమరావతి అభివృద్ధికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలవనుందని గళ్ళా మాధవి పేర్కొన్నారు.




