Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డోన్ ఎంఎల్ఎ |

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డోన్ ఎంఎల్ఎ |

కర్నూలు : డోన్ :
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదరసోదరీమణులతో కలిసి పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అనేది ప్రేమ, క్షమ, త్యాగం మరియు మానవత్వ విలువలను బలపరచే పర్వదినమని పేర్కొన్నారు. మతభేదాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జీవిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, యువత, మహిళలు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుత వాతావరణంలో ఆధ్యాత్మికంగా సాగింది. అనంతరం ఎమ్మెల్యే గారిని చర్చి ప్రతినిధులు సత్కరించారు.డోన్ పట్టణంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments